'డేటా సౌదీ' ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించిన సౌదీ అరేబియా

- March 09, 2024 , by Maagulf
\'డేటా సౌదీ\' ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించిన సౌదీ అరేబియా

రియాద్:  LEAP 2024 సందర్భంగా సౌదీ అరేబియా ఆర్థిక మరియు ప్రణాళికా మంత్రి ఫైసల్ అల్ ఇబ్రహీం "డేటా సౌదీ" ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. 180 దేశాలకు చెందిన వేలాది మంది అంతర్జాతీయ మరియు స్థానిక కంపెనీ ప్రతినిధులు,  నిపుణుల సమక్షంలో డిజిటల్ సౌదీ పెవిలియన్‌లో ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 2023లో ట్రయల్ నిర్వ‌హించారు. ఆర్థిక మరియు ప్రణాళికా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డేటా సౌదీ ప్లాట్‌ఫారమ్... ఆర్థిక మరియు సామాజిక డేటా కోసం కేంద్ర భాండాగారంగా ఉండ‌నుంది. ఈ ప్లాట్‌ఫారమ్ సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా డేటా యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి మరియు జాతీయ ఆర్థిక సమాచారానికి సంబంధించి పారదర్శకతను పెంపొందించడానికి వీలుగా రూపొందించారు. డేటా సౌదీ ప్లాట్‌ఫారమ్ అంతర్జాతీయ వాణిజ్య బ్యాలెన్స్, కార్మికుల చెల్లింపులు, మూలధనం మరియు ప్రస్తుత బ్యాలెన్స్‌పై ఖాతాలతో సహా వివిధ రకాల కీలక ఆర్థిక గ‌ణంకాల‌ను క‌లిగిఉంటుంది. దీంతోపాటు ఇది జనాభా సాంద్రత, జనన రేట్లు మరియు సమగ్ర జనాభా పిరమిడ్ వంటి అనేక సామాజిక సూచికలను పొందుప‌రిచారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com