రమదాన్..ఖతార్ మ్యూజియం సందర్శన వేళలు మార్పు
- March 11, 2024
దోహా: ఖతార్ మ్యూజియంలు (QM) రమదాన్ కాలానికి సంబంధించి పని వేళలను ప్రకటించింది. దీని ప్రకారం మ్యూజియం గ్యాలరీలు శనివారం నుండి గురువారం వరకు, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు రాత్రి 8 నుండి ఉదయం 12 గంటల వరకు.. శుక్రవారం రాత్రి 8 నుండి ఉదయం 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇదిలాఉండగా ఉదయం లేదా సాయంత్రం వేళలలో సందర్శకుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు మరియు ఈవెంట్లను నిర్వహిస్తారు. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA)లో "ఫ్యాషనింగ్ యాన్ ఎంపైర్: టెక్స్టైల్స్ ఫ్రమ్ సఫావిడ్ ఇరాన్" ఫీచర్ చేయబడిన ప్రదర్శనలలో ఒకటి. ఇది సఫావిడ్ కాలంలో (1501–1736CE) ప్రత్యేకతలను హైలైట్ చేస్తుంది. దీంతో పాటుగా "గోల్డెన్ స్పైడర్ సిల్క్" మథాఫ్ వద్ద: అరబ్ మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ లను చూడవచ్చు. ఫుట్‌బాల్ ఔత్సాహికులు 3-2-1 ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియంలో "జిదానే, 21వ శతాబ్దపు పోర్ట్రెయిట్"ని ఆస్వాదించవచ్చు. ఫైర్ స్టేషన్‌లోని “పిపిలోట్టి రిస్ట్: ఎలక్ట్రిక్ ఇడిల్” మిడిల్ ఈస్ట్‌లో రిస్ట్ యొక్క మొదటి సర్వే ప్రదర్శనను చూడవచ్చు. వీటితోపాటు అనేక ప్రత్యేకతలను మ్యూజియం పరిసరాలు, గ్యాలరీలలో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- మలేషియా: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- GymNation launches AED 1 million Foundation to back local talent, communities and wellness innovation
- నవంబర్ 5న ఖతార్‌లో వర్షం కోసం ప్రార్థనలు..
- మహిళల ప్రీమియర్ లీగ్ 2027 పూర్తి షెడ్యూల్ విడుదల
- అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!







