ఇస్మార్ట్ బ్యూటీ పరిస్థితి అలా అయిపోయిందే పాపం.!
- March 12, 2024‘అదుగో’ అంటూ తొలి సినిమాపై సైన్ చేసింది. కానీ, ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో కుర్రకారు హృదయాల్ని దోచేసింది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో జూనియర్ ఇలియానా బిరుదును సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.
కానీ ఆ సక్సెస్ ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. ఇంతకీ ఎవరి గురించి చెప్పుకుంటున్నామో గుర్తించారు కదా..! అదేనండీ నభా నటేష్. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘అల్లుడు అదుర్స్’ తదితర సినిమాల్లో నటించింది. అలాగే మాస్ రాజాతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుంది.
కానీ, కెరీర్లో ముందుకు సాగలేకపోయింది. మొన్నా మధ్య ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లిపోయిన నభా నటేష్ మళ్లీ వస్తోంది.
అయితే, ఈ సారి కమెడియన్ ప్రియదర్శికి జోడీగా నటించాల్సి వచ్చింది నభా నటేష్‌కి. ప్రియదర్శి హీరోగా రూపొందుతోన్న ఓ కామెడీ ఎంటర్ టైనర్లో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా నభా నటేష్ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ