అనన్య నాగళ్ల ‘తంత్రం’ ఫలించేలానే వుందిగా.!
- March 12, 2024
తెలుగమ్మాయ్ అనన్య నాగళ్లకు అన్నీ వున్నా అదృష్టం కలిసి రావడం లేదు. హీరోయిన్‌గానే వెండితెరకు పరిచయమైనప్పటికీ, సైడ్ క్యారెక్టర్లతోనూ సరిపెట్టుకోవల్సి వస్తోంది.
మొన్నా మధ్య సమంతకు చెలికత్తెగా ‘శాకుంతలం’ సినిమాలో నటించి మెప్పించింది అనన్య నాగళ్ల. సోషల్ మీడియాలో అమ్మడికున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
అదే ఫాలోయింగ్‌తో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇంతవరకూ గ్లామరస్ పాత్రల్లో మెరిసిన అనన్య నాగళ్ల, ఇప్పుడు ఓ ప్రయోగం చేయబోతోంది.
అదే ‘తంత్ర’ సినిమా. క్షుద్ర శక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అనన్య డిఫరెంట్ వేరియేషన్స్‌లో పర్పామెన్స్‌కి సిద్ధమైంది.
హారర్ సన్నివేశాలతో పాటూ, కొన్ని ఇంటిమేట్ సీన్లలోనూ నటించింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా వుంది. ఈ మధ్య ఈ తరహా హారర్ మూవీస్‌కి మంచి ఆదరణ దక్కుతోంది. అలా అనన్యకీ లక్కు కలిసొచ్చి ‘తంత్ర’ హిట్ అయితే పాప రేంజే మారిపోతుందిగా.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష