‘ఇండియన్ 2’ - ‘కల్కి’ పోరు తప్పదా.?
- March 12, 2024
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ని సమ్మర్ స్సెషల్‌గా మే లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే, అదే నెలలో మే 9న మరో భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి’ సినిమా కూడా రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే.
అదే డేట్‌కి ఏది ఏమైనా ‘కల్కి’ని రిలీజ్ చేయాలంటూ పట్టు పట్టుకుని కూర్చున్నారు అశ్వనీదత్ అండ్ టీమ్. అయితే, సరిగ్గా అదే డేట్‌కి ‘ఇండియన్ 2’ కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ అదే జరిగితే, రెండు ప్యాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడాల్సి వస్తుంది. కానీ, అది సాధ్యమవుతుందా.? అంతే కాదు, ఈ రెండు సినిమాలూ కమల్ హాసన్ నటించినవే కావడం విశేషం.
‘కల్కి’ సినిమాలో ప్రబాస్ హీరోగా నటిస్తుండగా. పవర్ ఫుల్ విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇక, ‘ఇండియన్ 2’ అనేది ఇటు కమల్ హాసన్‌కీ, అటు శంకర్‌కీ ఇద్దరికీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టే.
మరి, జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ అదే జరిగితే.. సినీ ప్రియులకి పండగే. కానీ, సాధ్యపడే అవకాశాలే చాలా తక్కువ. చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







