గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినొచ్చా.?
- March 12, 2024
గర్భిణీ స్త్రీలు పైనాపిల్ (అనాస పండు) తింటే పుట్టబోయే బిడ్డకి మంచిది కాదని గర్భస్రావం అవుతుందనీ నమ్ముతుంటారు. కానీ, శాస్రీయంగా అందుకు ఆధారాల్లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ (అనాస పండులో) ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు సి విటమిన్ అత్యంత అవసరం. పుట్టబోయే బిడ్డకు రోగ నిరోధక శక్తిని అందించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అలాగే, ఫోలేట్ అను పోషకం పుష్కలంగా లభిస్తుంది పైనాపిల్‌లో. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, మెదడు వృద్ధి చెందడంలో ఈ పోషకం కీలక పాత్ర వహిస్తుంది.
అందుకే ఖచ్చితంగా గర్భ ధారణ సమయంలో పైనాపిల్ తినమని నిపుణులు చెబుతుంటారు. కానీ, పెద్దలు మాత్రం గర్భిణీ స్త్రీలకు పైనాపిల్ నిషిద్ధ పండుగా భావిస్తుంటారు.
మందుల రూపంలో తీసుకునే విటమిన్లు, పోషకాలు.. పైనాపిల్ పండు ద్వారా నేచురల్‌గా బిడ్డకూ, తల్లికీ అందించడానికి పైనాపిల్ ఎంతో తోడ్పడుతుంది.
అందుకే ఎలాంటి అనుమానాలూ లేకుండా గర్భిణీ స్ర్తీలు పైనాపిల్ పండును తినొచ్చని అధ్యయనాలతో పాటూ, వైద్యులు కూడా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







