మాజీ భార్యపై దాడి.. వ్యక్తికి మూడు నెలల జైలుశిక్ష
- March 13, 2024
బహ్రెయిన్: తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో తన మాజీ భార్యపై దాడికి పాల్పడి, ఆమె వైకల్యానికి కారణమైన నిందితుడికి బహ్రెయిన్ హై అప్పీల్స్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. బాధితురాలి సోదరి దాడిని ప్రత్యక్షంగా చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు బాధితురాలిపై దాడి చేశాడని, ఆమె తలపై కొట్టాడని, ఆమెను గోడపైకి నెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో బాధితురాలి దంతాలు విరిగిపోయాయి. ఆమె ముఖానికి గాయాలయ్యాయి. ఫలితంగా 1% శాశ్వత వైకల్యం ఏర్పడింది. విచారణ సమయంలో కోర్టు సాక్ష్యాలను విశ్లేషించింది. శిక్ష విధించే సమయంలో దాడి యొక్క తీవ్రత , జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష