టిఫిన్‌ బాంబుల్ని స్వాధీనం

- June 04, 2016 , by Maagulf
టిఫిన్‌ బాంబుల్ని స్వాధీనం

గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన టిఫిన్‌ బాంబు పేలడంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటన తమిళనాడులోని మధుర సమీపంలో వైగై నదీ తీరంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులెవరో ఒక లారీని లక్ష్యంగా చేసుకుని ఈ పనిచేశారు. కొంత మందుగుండు సామగ్రిని టిఫిన్‌ బాక్సులో పెట్టి దాన్ని లారీ సమీపంలో పడేశారు. దీంతో అది పేలి స్టేషనరీ వస్తువులతో ఉన్న లారీ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ బాంబు అంత శక్తిమంతమైనదేమీ కాదని పోలీసులు తెలిపారు. అందువల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. గత పదేళ్లలో పోలీసులు మధురై, ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి ఐదు టిఫిన్‌ బాంబుల్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com