ఒమన్ పై ప్రశంసలు కురిపించిన UN రాయబారి

- March 15, 2024 , by Maagulf
ఒమన్ పై ప్రశంసలు కురిపించిన UN రాయబారి

మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌లో శాంతి నెలకోల్పడంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పాత్ర,  మద్దతు గొప్పదని ప్రశంసలు కురిపిస్తూ.. యెమెన్‌లోని UN రాయబారి ఐక్యరాజ్యసమితి కృతజ్ఞతలు తెలిపారు.  న్యూయార్క్‌లో హిస్ ఎక్సలెన్సీ ఒమన్ రాయబారి,  ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి నిర్వహించిన సమావేశం సందర్భంగా యెమెన్‌లోని UN ప్రత్యేక రాయబారి హిస్ ఎక్సలెన్సీ హన్స్ గ్రండ్‌బర్గ్.. తన ఆవర్తన నివేదికను సమర్పించే క్రమంలో ఒమన్ సుల్తానేట్ శాశ్వత ప్రతినిధి అయిన హిజ్ ఎక్సలెన్సీ అంబాసిడర్ డాక్టర్ ముహమ్మద్ బిన్ అవద్ అల్ హసన్‌తో సమావేశమయ్యారు.  ఐక్యరాజ్యసమితిలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ శాశ్వత ప్రతినిధి బృందం ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో.. యెమెన్ లో శాశ్వత శాంతి మరియు స్థిరత్వాన్ని సాధించడంలో మద్దతు ఇవ్వడంలో ఒమానీ పాత్రకు ఐక్యరాజ్యసమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు. యెమెన్‌కు మరియు దాని ఇతర పొరుగు దేశాల మధ్య బలమైన, శాంతియుత సంబంధాలను నెలకొల్పడానికి ఒమన్ విశిష్ఠ పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో యెమెన్‌లోని UN ప్రత్యేక రాయబారి కార్యాలయ సభ్యులు, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో ఒమన్ సుల్తానేట్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి కౌన్సెలర్ ఖలీద్ బిన్ సలేహ్ అల్-రబ్ఖీ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com