అలరించిన సినారె పాటకు పట్టాభిషేకం

- March 16, 2024 , by Maagulf
అలరించిన సినారె పాటకు పట్టాభిషేకం

హైదరాబాద్: మూడు వేల పైగా సినీ పాటలు రాసినా సినారె ప్రతి గీతం సాహిత్య పరంగా ప్రత్యేకత ఉన్నవని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి తొలి సినీ గీతం రచించి అరవై ఐదు సంవత్సరాలు అయిన సంధర్భంగా ప్రముఖ గాయకులు మిత్రా వై.ఏస్.రామకృష్ణ శశికళ గీతాంజలి లు నలభై పాటలను మధురంగా అలపించి పాటల పట్టాభిషేకం చేశారు.సినారె రచించిన తొలి పాట నన్ను దోచుకుందవాటే తో అరభించి ఎవరికీ తలవంచకు, చిత్రం భళారే విచిత్రం వంటి పాటలను వారు గానం చేశారు.ఈ సంధర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో నిర్వహకులు వంశీ రామరాజు తిరుమల గ్రూప్ చైర్మన్ నంగ నూరి చంద్ర శేఖర్ పాల్గొని మాట్లాడుతూ సినారె పాటలు నిత్య నూతనం అన్నారు. చంద్ర శేఖర్ గాయనీ గాయకులను అయోధ్య నుంచి తెప్పించిన శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.డాక్టర్ తెన్నేటి సుధ, సుంకరపల్లి శైలజ కార్యక్రమం పర్యవేక్షణ చేయగా సినారె కుమార్తెలు గంగ, యమున,కావేరి,కృష్ణవేణి తమ భర్తలతో పాల్గొన్నారు. ప్రముఖ నటి శారద చెన్నై నుంచి సందేశం పంపుతూ సినారె తన సినిమాలకు సాహిత్య సంగీత పరమైన హిట్ పాటలు రాశారని గుర్తు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com