నేడు విశాఖలో సీఎం రేవంత్ పర్యటన
- March 16, 2024
విశాఖపట్నం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 4:15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి 05:15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి 05:30 గంటలకు స్టీల్ ప్లాంట్ వద్ద ఉన్న తృష్ణ గ్రౌండ్ కి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మరల 07:00 గంటలకు అక్కడి నుండి బయలుదేరి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అనంతరం 07:15 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి పయనమవుతారు. ఇదిలా ఉండగా తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు