భోజనం తర్వాత సోడా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
- March 16, 2024
హెవీగా భోజనం తిన్నా.. లేదంటే మసాలా ఎక్కువగా వున్న ఆహారం తీసుకున్నా.. పొట్టలో బరువుగా అనిపిస్తుంది. ఆ వెంటనే కాస్త సోడా కానీ, లేదంటే, కూల్ డ్రింక్ కానీ తాగితే పొట్ట తేలిగ్గా అనిపిస్తుంది.
గ్యాస్ బయటికి పోయి, త్రేన్పులు వచ్చి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది. కానీ, ఇది కేవలం తాత్కాలికమైన పీలింగ్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. హెవీగా భోజనం చేశాకా సోడా, కూల్ డ్రింక్ వంటివి అస్సలు తీసుకోరాదని చెబుతున్నారు.
అవి తీసుకోవడం వల్ల గ్యాస్ బయటికి రావడం కాదు.. ఇంకా పెరుగుతుంది. అంలాగే ఇతరత్రా జీర్ణ సమస్యలు కూడా జోడవుతాయ్. ఇవి దీర్ఘ కాలం వేధిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ హెవీగా భోజనం తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరంగా బరువుగా అనిపిస్తే మరి ఏం చేయాలి.? కాస్త గోరు వెచ్చని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే కాస్త అల్లం వేసిన వేడి నీటిని తీసుకున్నా ఇంకా మంచి ఫలితం వుంటుంది. సోంప్ కానీ, వాము, జీలకర్ర కానీ తీసుకుంటే ఇంకా మంచిది.
హెవీ ఫుడ్ తీసుకునే టైమ్‌లో సరిపడా వాటర్ కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ కంటెంట్‌తో ఈక్వెల్‌గా వాటర్ కంటెంట్ కూడా వుండేలా చూసుకుంటే మంచిదని అంటున్నారు. భోజనానికి ముందు ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకుంటే.. భోజనం హెవీగా తీసుకునే అవసరం వుండదు. తద్వారా పొట్ట సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశముండదని డైటీషియన్ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష