సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అధికారిపై దాడి.. సోదరులకు శిక్ష

- March 16, 2024 , by Maagulf
సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అధికారిపై దాడి.. సోదరులకు శిక్ష

బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో పోలీసు అధికారిపై దాడి చేసి అవమానించిన కేసులో 25 ఏళ్ల వయసున్న కవల సోదరులను హైకోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పులో మొదటి నిందితుడికి జైలు శిక్ష, రెండో నిందితుడికి జరిమానా విధించారు. ఈ దాడిలో మొదటి నిందితుడికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, రెండవ నిందితుడికి BD50 పెనాల్టీ విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ సంఘటన జనవరి 13న జరిగింది.  మొదటి నిందితుడు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో తన అధికారిక విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై దాడి చేశాడు. ఈ దాడి వల్ల అధికారి దీర్ఘకాలంగా అనారోగ్యం లేదా 20 రోజులకు పైగా తన వ్యక్తిగత బాధ్యతలను నిర్వర్తించలేక పోయారు. రెండో నిందితుడు ఉద్యోగులను బహిరంగంగా దూషించాడని అభియోగాలు మోపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com