‘ఓం భీమ్ భుష్’.! నో లాజిక్స్..! ఓన్లీ మ్యాజిక్.!
- March 16, 2024
యంగ్ హీరో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్టుగా నిలిచింది. అదే హిట్టు కాంబినేషన్‌తో ఇప్పుడు మళ్లీ ఇంకో సినిమా రాబోతోంది.
అదే ‘ఓం భీమ్ భుష్’. టైటిల్ చాలా క్యాచీగా డిఫరెంట్‌గా వుంది. సినిమా కూడా అలాగే చాలా డిఫరెంట్‌గా వుండబోతోంది. ఈ సినిమాని తొలి పోస్టర్ నుంచీ డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఆధ్యంతం నవ్వుల సినిమాగా ప్రమోట్ అవుతోంది ట్రైలర్‌ని బట్టి చూస్తే. శ్రీవిష్ణు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటున్నాడు.
అలాగే రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ తమ కామెడీ టైమింగ్‌తో చితక్కొట్టేస్తున్నారు. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్.. అంటూ ఓ నిధి అన్వేషణ నిమిత్తం డిఫరెంట్‌గా డిజైన్ చేసిన నవ్వుల కాన్సెప్ట్‌గా ‘ఓమ్ భీమ్ భుష్’ సినిమా వుండబోతోంది. హర్ష కొణగంటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష