హమ్మయ్యా.! ఇస్మార్ట్ బ్యూటీకి ఇదో గోల్డెన్ ఛాన్సే.!
- March 16, 2024
‘ఇస్మార్ట్’ బ్యూటీ నభా నటేష్ ఇటీవల కమెడియన్ ప్రియదర్శితో ఓ సినిమాకి సైన్ చేసింది. ఈ న్యూస్ తెలిసిన ఆమె ఫ్యాన్స్ అయ్యో పాపం అమ్మడి పరిస్థితేంటీ.! ఇలా అయిపోయిందనుకున్నారు.
అయితే, పెద్ద బ్యానర్ సినిమానే.. కానీ, ఎంతైనా స్టార్ హీరోయిన్ ఛైర్‌ని కొన్ని అడుగుల దూరంలోనే మిస్ అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. దాంతో, ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.
తాజాగా అమ్మడికి ఓ బంపర్ ఛాన్స్ తగిలినట్లు సమాచారం. ‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్ధ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
నిఖిల్ ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే ‘స్వయంభు’. పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా నభా నటేష్‌ని మరో ఇంపార్టెంట్ రోల్ కోసం సంప్రదించారట.
వారియర్ క్వీన్ తరహా పాత్రనీ తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ అయితేనేం, సినిమా హిట్టయితే మళ్లీ సోదిలోకి వస్తుంది నభా నటేష్. అలా, నిఖిల్ రూపంలో నభా నటేష్‌కి వచ్చిన ఈ సూపర్ ఛాన్స్ అయినా వర్కవుట్ అవుతుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







