ఏఎస్ఆర్టీయూ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వీసీ సజ్జనర్
- March 16, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్‌టీయూ) స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్ లో జరిగిన ఏఎస్ఆర్టీయూ 54వ జనరల్ బాడీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా దేశంలోని ఆర్టీసీల ఎండీలు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానిక్ ఇంజనీర్(సీఎంఈ) రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలిపింది.
స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన వీసీ సజ్జనర్ కి ఏఎస్ఆర్టీయూ వైస్ ప్రెసిడెంట్, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు అభినందనలు తెలియజేశారు.
తనను ఎన్నుకున్న ఆర్టీసీల ఎండీలకు ధన్యవాదాలు తెలిపిన వీసీ సజ్జనర్.. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష