‘గేమ్ ఛేంజర్’ లీకులతోనే సరిపెట్టుకోవాలా.?
- March 16, 2024
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’కి లీకుల బెడద తప్పడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ నేపథ్యంలో కొన్ని లీక్డ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. గతంలోనూ ఇలాగే ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు లీక్ అయిపోయాయ్. సినిమాకి సీక్రెట్ రోల్ అయిన రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ రోల్, గెటప్ అలాగే తెలిసిపోయింది.
ఇప్పుడు ఇంకోసారి. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది లేదు. కానీ, లీకుల రూపంలో దాదాపు చాలానే అప్డేట్స్ బయటికొచ్చేశాయ్.
పొలిటికల్ టిపికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. కియారా అద్వానీతో పాటూ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, తమిళ నటుడు ఎస్.జె.సూర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా లీక్ అయిన ఫోటోల్లో ఎస్.జె.సూర్యకి సంబంధించిన గెటప్ కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







