శ్రీవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్
- March 16, 2024
తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, యాత్రికులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు.ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా ఆక్టోపస్ ఎస్పీ నాగేంద్రబాబు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ నగేష్బాబు ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా , భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. ఈ ఆపరేషన్ లో తిరుమల విజివో నంద కిషోర్, తిరుమల డి.ఎస్.పి శ్రీనివాస ఆచారి, ఏవిఎస్ఓలు, పోలీసు, ఆక్టోపస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి
- ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం
- ‘ఫిల్మ్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక ప్రదర్శన–సినిమా రంగానికి కొత్త దిశ
- గ్లోబల్ సమ్మిట్.. సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!







