ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు ఛాన్స్
- March 17, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అర్హతగల యువకులు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచిస్తోంది. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-8 అప్లికేషన్ను ఆన్లైన్లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చు. ఎన్నికల సహాయ అధికారి, పోలింగ్ కేంద్రం అధికారికి కూడా ప్రత్యక్షంగా దరఖాస్తును అందజేయవచ్చు. వివరాలను కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
కాగా ఓటు నమోదు ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది. జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తోంది. https://nvsp.in,http://https://ceotelangana.nic.in వెబ్సైట్లపై ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష