వైఎస్సార్సిపీ కువైట్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం
- March 17, 2024
కువైట్ సిటీ: కువైట్ 16.03.2024 : కువైట్ దేశం లోని ఫర్వానియా పట్టణంలో గల నౌషాద్ హోటల్ లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ నూతన కమిటీ సభ్యులకు పార్టీ కండువాలు వేసి పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు.పార్టీ విధి విధానాలు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కమిటీ సభ్యులు ఎవరెవరు వస్తున్నారని వారి పూర్తి వివరాలు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు తో సార్వత్రిక ఎన్నికలకు పోయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కారణాలు కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావలి అని ప్రజలు అనుకున్నారు దానికి తోడు ప్రశ్నించేందుకు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పై అభిమానంతో వారి సామాజిక వర్గం అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని అలాగే మోడీ కరిష్మా ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, 2014లో ఎన్నికల ప్రచారంలో సుమారు 6 వందల ఉచిత హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి నెరవేర్చలేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 4 సం: లలో ఒకసారి కూడా ప్రశ్నించలేదని, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రాష్ట్రానికి ఇస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా మాటే మరిచింది. ఈ మూడు పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదని, 2019 లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక చెప్పనివి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేశారు.
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందజేసి తన తండ్రిలాగే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 2014 లాగా 2024 కూడా గెలుస్తాం అని ఊహల్లో ఉన్నారని ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన విజయం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీదే. జననేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇది నిజం ఇది సత్యం ఇది తధ్యం అని తెలిపారు.
గల్ఫ్ కో-కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు నాయని మహేష్ రెడ్డి, మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రష్యా ఉక్రెయిన్ సమయంలో విద్యార్థులను రాష్ట్రాన్ని సురక్షితంగా తీసుకొని రావడంలో గాని సుడాన్ లో ప్రజలకు ప్రభుత్వానికి జరిగిన అంతర్గత ఘర్షణ సమయంలో సుడాన్ లో మన రాష్ట్రానికి చెందిన 63 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొని రావడం లో సఫలీ కృతు లయ్యారు. కరోనా సమయంలో ప్రవాసాంధ్రులకు చేసిన మేలు జీవితంలో మరచి పోలేమని 2019 నుండి ఇప్పటి వరకు 2 లక్షల 50 వేలకు పైగా ప్రవాసాంధ్రుల వివిధ రూపాల్లో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS ద్వారా సమస్యలను పరిష్కరించింది. ఒక కువైట్ లోనే చాలా ఎక్కువ మంది సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.
వైఎస్ఆర్సిపీ కువైట్ కో కన్వీనర్ రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ గఫార్ మాట్లాడుతూ, అవ్వా తాతలకు పింఛన్ సరి అయిన సమయానికి ఇంటి దగ్గర తెచ్చి ఇవ్వాలన్న, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత చదువుకోవాలన్న, రాజకీయాలలో సామాజిక న్యాయం కావాలన్న, మరల వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గఫార్, అన్నాజీ రాజశేఖర్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో(జిసిసి) గల్ఫ్ సలహాదారులు యం.వి నరసారెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు, షేక్, గౌస్ బాషా, కువైట్ కో కన్వీనర్లు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, ఆకుమర్తి లాజరాస్, షేక్ షా హుస్సేన్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మి ప్రసాద్, షేక్, రహమతుల్లా, బి. ఎన్. సింహా, ఏ. బాలకృష్ణ రెడ్డి, గోవిందు రాజు, అప్సర్ అలీ, పి. ప్రభాకర్ యాదవ్, మహబూబ్ బాషా, చల్లా అమర్నాథ్ రెడ్డి, సయ్యద్ ఇమ్రాన్, ఆబూతురాబ్, సయ్యద్ సలీం, పాటూరు వాసు, సుబ్బారావు,కల్లూరు వాసుదేవ రెడ్డి,పోలి గంగిరెడ్డి, మరియు నూతన కువైట్ కమిటీ సభ్యులు వై.యస్. కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష