ఆర్థిక సమస్యలపై చర్చకు రమదాన్ స్పెషల్ సెషన్లు..OCCI

- March 17, 2024 , by Maagulf
ఆర్థిక సమస్యలపై చర్చకు రమదాన్ స్పెషల్ సెషన్లు..OCCI

మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ప్రస్తుత ఆర్థిక ధోరణులు మరియు ప్రైవేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై నాలుగు రమదాన్ సెషన్ల(రమదాన్ ఈవెనింగ్స్)ను నిర్వహించనుంది. ఈ సెషన్ లలో పలువురు అధికారులు, నిపుణులు, నిర్ణయాధికారులు పాల్గొంటారు. OCCI బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ మాట్లాడుతూ.. ఇది ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా ఉందని, ఈ కార్యక్రమంలో వివిధ ఆర్థిక అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. మొదటి సెషన్ సోమవారం సాయంత్రం ప్రారంభమవుతుందని, వ్యాపార వాతావరణం మరియు ప్రైవేట్ రంగ వ్యాపారం యొక్క స్థిరత్వానికి సంబంధించిన అనేక సమస్యలను చర్చించనున్నట్లు తెలిపారు.  ఇతర సెషన్లలో ఫ్యూచర్ ఫండ్ ఒమన్ పాత్ర, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యం, వ్యాజ్య ప్రక్రియలను సులభతరం చేయడం, సమాచార సాంకేతికతలో పురోగతి మరియు నేరపూరిత జవాబుదారీతనం వెలుగులో వాణిజ్య తీర్పుల అమలు గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com