అధికారులకు సేవా పతకాలు అందజేసిన సుల్తాన్
- March 18, 2024
మస్కట్: SSF దినోత్సవం సందర్భంగా సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ (SSF)కి చెందిన అనేక మంది అధికారులు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సేవా పతకాలను, రాయల్ మెమోన్డేషన్ను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 15న SSF దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసుమూద్ గారిసన్లో జరిగిన కార్యక్రమం SSF కమాండర్ మేజర్ జనరల్ ముసల్లం మహమ్మద్ జాబూబ్ అధ్యక్షతన జరిగింది. మేజర్ జనరల్ జాబుబ్ ఉత్తమ సేవలను అందించిన సిబ్బందిని సత్కరించారు. సుప్రీమ్ కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో వారి ఉన్నత పనితీరును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ సీనియర్ అధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







