రియల్ ఎస్టేట్ లీజింగ్ నియంత్ర‌ణ ముసాయిదా చ‌ట్టానికి ఆమోదం

- March 18, 2024 , by Maagulf
రియల్ ఎస్టేట్ లీజింగ్ నియంత్ర‌ణ ముసాయిదా చ‌ట్టానికి ఆమోదం

యూఏఈ: షార్జాలో రియల్ ఎస్టేట్ లీజింగ్‌కు సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించిన ముసాయిదా చట్టం షార్జా కన్సల్టేటివ్ కౌన్సిల్ (SCC) ఆమోదం తెలిపింది.  పదకొండవ శాసనసభ ఆరవ సమావేశంలో ముసాయిదా చట్టం తుది ఆమోదం పొంద‌నుంది. షార్జా ప్రభుత్వ న్యాయ విభాగం అధిపతి, కౌన్సెలర్ డాక్టర్ మన్సూర్ మహమ్మద్ బిన్ నాసర్ మాట్లాడుతూ..  షార్జా నగరంలో అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఓన‌ర్, రెంట‌ర్స్ మధ్య సంబంధాన్ని నియంత్రించేందుకు ప్రస్తుత ముసాయిదా చట్టం జ‌వాబుదారిగా నిలుస్తుంద‌న్నారు. అదే విధంగా షార్జా పెట్టుబడిదారులు, కుటుంబాలకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కలిగి ఉందని, అందువల్ల కొనుగోలు - అమ్మకం, ఇతర రియల్ హక్కులతో సహా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నియంత్రించడానికి బలమైన చట్టం అవుతుంద‌న్నారు. గ‌తంలో ఉన్న‌ చట్టం 2007లో రూపొందించార‌ని, ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా దానిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com