'ఫోర్బ్స్ టాప్ 100' వ్యాపారాలు.. ఏడు ఖతార్ సంస్థలు
- March 18, 2024
దోహా: ఫోర్బ్స్ మ్యాగజైన్ 2024లో మధ్యప్రాచ్యంలోని టాప్ 100 అరబ్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితాలో ఏడు ఖతార్ కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి. అల్ ఫైసల్ హోల్డింగ్ (ర్యాంక్ 11), వ్యవస్థాపకుడు- ఛైర్మన్ ఫైసల్ బిన్ ఖాసిమ్ అల్ థానీ; పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ (ర్యాంక్ 12), ప్రెసిడెంట్ - గ్రూప్ సీఈఓ రమేజ్ అల్ ఖయ్యత్; అల్ఫర్డాన్ గ్రూప్ (ర్యాంక్ 17), ఛైర్మన్ - హుస్సేన్ ఇబ్రహీం అల్ఫర్దాన్; డార్విష్ హోల్డింగ్ (ర్యాంక్ 63), ఛైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ బాదర్ అబ్దుల్లా అల్ దర్విష్; అల్మానా గ్రూప్ (ర్యాంక్ 73), వైస్ చైర్మన్ – సౌద్ ఒమర్ HA అల్మానా, అబు ఇస్సా హోల్డింగ్ (ర్యాంక్ 83), చైర్మన్ – అష్రఫ్ అబు ఇస్సా; అల్ ముఫ్తా గ్రూప్ (ర్యాంక్ 100), చైర్మన్ - అబ్దుల్‌రెహ్మాన్ ముఫ్తా అల్ముఫ్తా లు ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ మార్చి సంచికలో అగ్రశ్రేణి కంపెనీల ర్యాంకింగ్‌లో చోటు సంపాదించారు.
ఫోర్బ్స్ ప్రకారం.. ఆరు సంస్థలు 1800లలో స్థాపించబడ్డాయి. 26 1950కి ముందు స్థాపించబడ్డాయి. కేవలం ఆరు మాత్రమే 2000లలో స్థాపించినవి ఉన్నాయి. కుటుంబ వ్యాపార రంగంలో GCC కుటుంబాలు అత్యంత విజయవంతమైనవిగా ఉన్నాయి. 100 కుటుంబ వ్యాపారాలలో సౌదీ అరేబియా నుండి 34 , యూఏఈ నుండి 28, ఖతార్, కువైట్ నుండి 7 చొప్పున ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!







