అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్ సేల్

- March 19, 2024 , by Maagulf
అబుదాబిలోని అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్ సేల్

యూఏఈ: అబుదాబిలోని సాదియత్ ద్వీపంలో మూడు పడకగదుల బీచ్‌ఫ్రంట్ పెంట్‌హౌస్ Dh137 మిలియన్లకు సేల్ అయింది. ఎమిరేట్‌లో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ సేల్ గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. నోబు రెసిడెన్స్‌లోని పెంట్‌హౌస్‌ను రియల్ ఎస్టేట్ డెవలపర్ అల్దార్ నిర్మించి విక్రయించారు. చదరపు మీటరుకు ధర కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇది చదరపు మీటరుకు Dh96,000 కంటే ఎక్కువగా పలికింది. అదే డెవలప్‌మెంట్‌లో నాలుగు పడకల డ్యూప్లెక్స్ స్కై విల్లా ఇటీవలి Dh130 మిలియన్లకు సేల్ అయింది. ఈ రికార్డు లావాదేవీ అబుదాబిలోని రెసిడెన్సీ ప్రాపర్టీకి కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసిందని అల్దార్‌లోని గ్రూప్ సీఈఓ తలాల్ అల్ ధియేబీ అన్నారు.  అబుదాబి రియల్ ఎస్టేట్ సెంటర్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రషెడ్ అల్ ఒమైరా మాట్లాడుతూ.. కొత్త రికార్డు నివసించడానికి, పని చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే ప్రదేశంగా దుబాయ్ వృద్ధిని ఇవి స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నోబు రెసిడెన్సెస్ అబుదాబి నోబు యొక్క జపనీస్ డిజైన్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇది సాదియత్ గ్రోవ్ మరియు మంషా అల్ సాదియత్‌లకు వాకబుల్ దూరంలో ఉంది. 60,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ప్రీమియం షాపింగ్, డైనింగ్ మరియు హాస్పిటాలిటీ అనుభవాలతో వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌ను ఇది అందిస్తుంది. Dh137 మిలియన్ల పెంట్ హౌస్ ఒక ప్రైవేట్ ఎలివేటర్‌తో మొత్తం అంతస్తును కవర్ చేస్తుంది. ఐకానిక్ గుగ్గెన్‌హీమ్ మ్యూజియం మరియు ప్రశాంతమైన గ్రోవ్ బౌలేవార్డ్‌తో రూపొందించబడిన ప్రైవేట్ పూల్‌తో పాటు విశాలమైన టెర్రస్‌ను కలిగి ఉంటుందని తలాల్ అల్ ధియేబీ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com