కువైట్ లో పెరుగుతున్న ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్..!
- March 19, 2024
కువైట్: ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ దేశంలో ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ పెరుగుతోంది. నివేదిక ప్రకారం.. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ 8,380 మెగావాట్లకు చేరుకుందని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ వెల్లడించారు. పవిత్ర రమదాన్ మాసంలో విద్యుత్ డిమాండ్లు పెరిగినప్పటికీ ఇంధన సంక్షోభం లేదని తెలిపారు. అదే సమయంలో విద్యుత్ పొదుపును పాటించాలని పౌరులు మరియు నివాసితులకు పిలుపునిచ్చారు. గత సంవత్సరం, వేసవిలో ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ దాదాపు 17,000 మెగావాట్లకు చేరుకుందని, కొన్ని స్టేషన్లలో లోపాల కారణంగా దేశవ్యాప్తంగా స్థానికీకరించిన విద్యుత్తు అంతరాయానికి దారితీసిందని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







