సీరత్ కపూర్.! ఇక అంతేనా.!
- March 19, 2024అందాల భామ సీరత్ కపూర్‌ని కేవలం అందాల ఆరబోత కోసమే వాడుతున్నారు మేకర్లు. ‘రన్ రాజా రన్’ సినిమాతో క్యూట్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేసినప్పటికీ పేరు సంపాదించుకోవడంలో మాత్రం అంతంత మాత్రంగానే వుంది.
కేవలం అందాల ఆరబోతే కాదు.. మంచి విషయం కూడా వుంది సీరత్ కపూర్‌లో. కానీ, మేకర్లు ఆమె కోసం డిజైన్ చేస్తున్న క్యారెక్టర్లన్నీ ఆ తరహావే. ప్రాధాన్యత వున్న పాత్రల్లో ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు.
ఇటీవల ఓటీటీలోనూ సీరత్ కపూర్ బాగానే సందడి చేస్తోంది. ప్రియమణి లీడ్ రోల్ పోషించిన ‘భామా కలాపం’ సినిమాతో పాటూ, వెరీ లేటెస్ట్గా ‘సేవ్ ద టైగర్స్ 2’ వెబ్ సీరిస్‌లోనూ సీరత్ నటించింది.
ఈ రెండు సిరీస్‌లలోనూ సీరత్ కపూర్ అందాలే హైలైట్ అయ్యాయ్. అయితే, ఒక్క ఛాన్స్.. గొప్ప ఛాన్స్ ఇస్తే.. తానేంటో ప్రూవ్ చేసుకుంటా.. అంటోంది సీరత్ కపూర్. తనలోని నటికి పదును పెట్టే పాత్రలను కోరుకుంటోంది. చూడాలి మరి, అలాంటి రోల్స్ ఎప్పటికి పడతాయో.!
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..