మహేష్‌తో రాజమౌళి ఇప్పట్లో తేల్చేలా లేడుగా.!
- March 19, 2024
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా సూపర్ స్టార్ మహేష్‌బాబుతో వుంటుందని అప్పట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇంకా ఈ సినిమా మేనియా నుంచి రాజమౌళి బయటపడలేదు.
ఈ లోపే అడపా దడపా ఆయన తదుపరి సినిమా గురించి కూడా వార్తలు గాసిప్స్ రూపంలో గుప్పుమంటున్నాయ్. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మహేష్‌బాబుతో సినిమా స్టార్ట్ అవుతుందనీ.. పలానా వాళ్లు నటీనటులుగా సెలెక్ట్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
కానీ, ఇంకా అలాంటిదేమీ లేదనీ, ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కేవలం మహేష్‌బాబు మాత్రమే ఓకే అయ్యారనీ మిగిలిన నటీ నటుల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయంతే.. ఎవ్వరూ ఫైనల్ కాలేదనీ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి స్పష్టత ఇచ్చారు.
ఇంతవరకూ ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనా కపూర్ నటిస్తుందనీ, కాదు కాదు, దీపిక పదుకొనె అనీ, కాదు జాన్వీ కపూర్.. అనీ విలన్‌గా హృతిక్ రోషన్ నటిస్తున్నాడనీ వార్తలు వినిపించాయ్. కానీ, అందులో ఎలాంటి నిజం లేదనీ జక్కన్న తెలిపారు. ప్రస్తుతానికి స్ర్కిప్ట్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయ్యిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







