శక్తిమాన్ మళ్లీ వస్తున్నాడోచ్.!
- March 19, 2024
ఒకప్పుడు టెలివిజన్‌లో శక్తిమాన్ సిరీస్‌కి వున్న క్రేజ్ వేరే లెవల్. ఆ మాటకొస్తే.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సూపర్ హీరోల కథలకి మన వెండితెరపై వున్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. వెరీ లేటెస్ట్‌గా వచ్చిన ‘హనుమాన్’ సినిమా అంత విజయవంతం కావడానికి కారణం ఆ సూపర్ మేన్ కాన్సెప్ట్టే.
అయితే, అప్పట్లో విజయవంతమైన ‘శక్తిమాన్’ స్టోరీని ఇప్పుడు వెండితెరపై సినిమాగా ఆవిష్కరించేందుకు సన్ పిక్చర్స్ సంస్థ ముందుకొచ్చింది. శక్తిమాన్ పాత్రలో రణ్వీర్ సింగ్ పేరు వినిపిస్తోంది. అప్పట్లో శక్తిమాన్ అంటే, ముఖేష్ ఖన్నానే. ఆ పాత్రలో ఆయన ఇంపాక్ట్ అంతలా క్రియేట్ చేశారు.
మరి, రణ్వీర్ సింగ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా.? లేదా.? అనేది తెలియాల్సి వుంది. అయితే, ఈ స్టోరీపైనా, రణ్వీర్ పాత్ర పైనా బాలీవుడ్‌లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయ్. సీనియర్ శక్తిమాన్ ముఖేష్ ఖన్నా.. ఆ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అందులో నిజమెంతో తెలియాల్సి వుంది. అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని టైమ్‌లోనే శక్తిమాన్ సాహాసాలకు ఫిదా అయ్యారు సినీ జనం. ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఇంకే స్థాయిలో ఆ పాత్రని డిజైన్ చేయబోతున్నారో చూడాలి మరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







