శక్తిమాన్ మళ్లీ వస్తున్నాడోచ్.!
- March 19, 2024ఒకప్పుడు టెలివిజన్‌లో శక్తిమాన్ సిరీస్‌కి వున్న క్రేజ్ వేరే లెవల్. ఆ మాటకొస్తే.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సూపర్ హీరోల కథలకి మన వెండితెరపై వున్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. వెరీ లేటెస్ట్గా వచ్చిన ‘హనుమాన్’ సినిమా అంత విజయవంతం కావడానికి కారణం ఆ సూపర్ మేన్ కాన్సెప్ట్టే.
అయితే, అప్పట్లో విజయవంతమైన ‘శక్తిమాన్’ స్టోరీని ఇప్పుడు వెండితెరపై సినిమాగా ఆవిష్కరించేందుకు సన్ పిక్చర్స్ సంస్థ ముందుకొచ్చింది. శక్తిమాన్ పాత్రలో రణ్వీర్ సింగ్ పేరు వినిపిస్తోంది. అప్పట్లో శక్తిమాన్ అంటే, ముఖేష్ ఖన్నానే. ఆ పాత్రలో ఆయన ఇంపాక్ట్ అంతలా క్రియేట్ చేశారు.
మరి, రణ్వీర్ సింగ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా.? లేదా.? అనేది తెలియాల్సి వుంది. అయితే, ఈ స్టోరీపైనా, రణ్వీర్ పాత్ర పైనా బాలీవుడ్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయ్. సీనియర్ శక్తిమాన్ ముఖేష్ ఖన్నా.. ఆ పాత్రలో రణ్వీర్ సింగ్ నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అందులో నిజమెంతో తెలియాల్సి వుంది. అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని టైమ్‌లోనే శక్తిమాన్ సాహాసాలకు ఫిదా అయ్యారు సినీ జనం. ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఇంకే స్థాయిలో ఆ పాత్రని డిజైన్ చేయబోతున్నారో చూడాలి మరి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..