సీరత్ కపూర్.! ఇక అంతేనా.!
- March 19, 2024
అందాల భామ సీరత్ కపూర్‌ని కేవలం అందాల ఆరబోత కోసమే వాడుతున్నారు మేకర్లు. ‘రన్ రాజా రన్’ సినిమాతో క్యూట్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేసినప్పటికీ పేరు సంపాదించుకోవడంలో మాత్రం అంతంత మాత్రంగానే వుంది.
కేవలం అందాల ఆరబోతే కాదు.. మంచి విషయం కూడా వుంది సీరత్ కపూర్‌లో. కానీ, మేకర్లు ఆమె కోసం డిజైన్ చేస్తున్న క్యారెక్టర్లన్నీ ఆ తరహావే. ప్రాధాన్యత వున్న పాత్రల్లో ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు.
ఇటీవల ఓటీటీలోనూ సీరత్ కపూర్ బాగానే సందడి చేస్తోంది. ప్రియమణి లీడ్ రోల్ పోషించిన ‘భామా కలాపం’ సినిమాతో పాటూ, వెరీ లేటెస్ట్‌గా ‘సేవ్ ద టైగర్స్ 2’ వెబ్ సీరిస్‌లోనూ సీరత్ నటించింది.
ఈ రెండు సిరీస్‌లలోనూ సీరత్ కపూర్ అందాలే హైలైట్ అయ్యాయ్. అయితే, ఒక్క ఛాన్స్.. గొప్ప ఛాన్స్ ఇస్తే.. తానేంటో ప్రూవ్ చేసుకుంటా.. అంటోంది సీరత్ కపూర్. తనలోని నటికి పదును పెట్టే పాత్రలను కోరుకుంటోంది. చూడాలి మరి, అలాంటి రోల్స్ ఎప్పటికి పడతాయో.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష