రాశి ఖన్నాను టాలీవుడ్ మర్చిపోయిందా.?
- March 19, 2024
అందాల భామ రాశి ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించేసింది. బాలీవుడ్లో ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా వుంది. ఆమె నటించిన ‘యోధ’ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. దీంతో పాటూ మరో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో వున్నాయ్.
అలాగే, తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తోంది రాశిఖన్నా. కానీ, తెలుగులో మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఓకే చేసింది. అదే ‘తెలుసు కదా’. యూత్‌ఫుల్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశీఖన్నాకి జోడీగా నటిస్తున్నాడు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగడం లేదు. ఓ వైపు సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బిజీగా వున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ వుండడంతో ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నాడు.
దాంతో ‘తెలుసు కదా’ షూటింగ్ కాస్త డిలే అవుతోందట. అయితే, తెలుగులో రాశీ ఖన్నాని మర్చిపోక ముందే, ఏదో ఒక సినిమా రాశీ ఖన్నా నుంచి రిలీజ్ కావల్సి వుంది. అది క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ సినిమా అయితే, కొన్నిరోజులు కాస్త సోదిలో వుంటుంది. అది మాత్రం పక్కా.!
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు