‘మంత్రవిద్య’తో భిక్షాటన.. ఆసియా మహిళ అరెస్ట్
- March 20, 2024
దుబాయ్: భిక్షాటన చేసినందుకు దుబాయ్‌లో ఒక ఆసియా మహిళను అరెస్టు చేశారు. ఆమెను వద్దనుంచి మంత్రవిద్య, చేతబడి వస్తువులను పోలీసులు గుర్తించారు. ఈ సామగ్రిని తీసుకువెళ్లడం వల్ల 'ప్రజలను ప్రభావితం చేయడంలో సహాయపడుతుందని' ఆమె నమ్మినట్లు విచారణలో తెలిపిందని అధికారులు వెల్లడించారు. పోలీసులు ఆమె వద్ద 'కాగితాలు, పనిముట్లు, మంత్రవిద్య తాలిస్మాన్‌లు మరియు మేజిక్ వీల్స్'ను గుర్తించినట్లు, వీటిని ఆమె భిక్షాటన చేసేటప్పుడు ఉపయోగించేదని, తను కోరుకున్న డబ్బును అందించడానికి ప్రజలను ప్రభావితం చేయడానికి అవి సహాయపడతాయని ఆమె నమ్ముతుందని దుబాయ్ పోలీస్ విభాగం డైరెక్టర్ బ్రిగ్ అలీ సలేమ్ అల్ షమ్సీ తెలిపారు. పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఓ నివాసి ఇచ్చిన సమాచారంతో సదరు మహిళను పట్టుకున్నట్లు వెల్లడించారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో భిక్షాటనను ఎదుర్కోవడానికి అధికారులు పెట్రోలింగ్ కార్యకలాపాలను వేగవంతం చేశారు. గతవారం దుబాయ్‌లో భిక్షాటన చేస్తూ మహిళ వేషంలో ఉన్న ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు