‘మంత్రవిద్య’తో భిక్షాటన.. ఆసియా మహిళ అరెస్ట్
- March 20, 2024దుబాయ్: భిక్షాటన చేసినందుకు దుబాయ్లో ఒక ఆసియా మహిళను అరెస్టు చేశారు. ఆమెను వద్దనుంచి మంత్రవిద్య, చేతబడి వస్తువులను పోలీసులు గుర్తించారు. ఈ సామగ్రిని తీసుకువెళ్లడం వల్ల 'ప్రజలను ప్రభావితం చేయడంలో సహాయపడుతుందని' ఆమె నమ్మినట్లు విచారణలో తెలిపిందని అధికారులు వెల్లడించారు. పోలీసులు ఆమె వద్ద 'కాగితాలు, పనిముట్లు, మంత్రవిద్య తాలిస్మాన్లు మరియు మేజిక్ వీల్స్'ను గుర్తించినట్లు, వీటిని ఆమె భిక్షాటన చేసేటప్పుడు ఉపయోగించేదని, తను కోరుకున్న డబ్బును అందించడానికి ప్రజలను ప్రభావితం చేయడానికి అవి సహాయపడతాయని ఆమె నమ్ముతుందని దుబాయ్ పోలీస్ విభాగం డైరెక్టర్ బ్రిగ్ అలీ సలేమ్ అల్ షమ్సీ తెలిపారు. పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు ఓ నివాసి ఇచ్చిన సమాచారంతో సదరు మహిళను పట్టుకున్నట్లు వెల్లడించారు. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో భిక్షాటనను ఎదుర్కోవడానికి అధికారులు పెట్రోలింగ్ కార్యకలాపాలను వేగవంతం చేశారు. గతవారం దుబాయ్లో భిక్షాటన చేస్తూ మహిళ వేషంలో ఉన్న ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..