మక్కాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యూనివర్సిటీ స్టూడెంట్స్ మృతి
- March 20, 2024
మక్కా: మక్కాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్ అల్-ఖురా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల నివేదికల ప్రకారం.. విద్యార్థులను తీసుకెళ్తున్న మినీబస్సు వర్షం కురుస్తున్న సమయంలో అదుపుతప్పి రోడ్డులోని ట్రాఫిక్ ఐలాండ్‌లోని లైటింగ్ స్తంభాలలో ఒకదానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ బస్సు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్స్, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మక్కాలోని ఫోర్త్ రింగ్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన స్టూడెంట్స్ అల్-జహీర్ పరిసరాల్లో ఉన్న యూనివర్సిటీ బ్రాంచ్‌లోని విద్యార్థులుగా గుర్తించారు. భద్రతా అధికారులు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మరణించిన స్టూడెంట్స్ మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు సౌదీ ట్రాఫిక్ డైరెక్టరేట్ తన X ఖాతాలో పేర్కొన్నారు. స్టూడెంట్స్ మరణంపై ఉమ్ అల్-ఖురా యూనివర్శిటీ ప్రెసిడెంట్, ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







