ఆఫ్గనిస్తాన్: తెరుచుకున్న పాఠశాలలు.. బాలికలపై నిషేధం
- March 20, 2024
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు బుధవారం నుండి తెరుచుకున్నాయి. ఆఫ్ఘన్ కేలండర్ ప్రకారం నూతన సంవత్సరాదికి ఒకరోజు ముందు అకడమిక్ ఇయర్ పున: ప్రారంభమైందని పేర్కొంది. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రావిన్స్‌లలో పాఠశాల బెల్ మోగడంతో ఆఫ్ఘన్లో వేడుక ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రభుత్వ యూనివర్శిటీలలో కూడా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైందని తెలిపింది.
అయితే ఉన్నత స్థాయి తరగతుల్లో చేరకుండా బాలికలపై నిషేధం ఈ ఏడాది కూడా కొనసాగనుందని విద్యాశాఖ ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న అనంతరం 2022 మార్చిలో తాలిబన్ ప్రభుత్వం బాలికల ఉన్నత విద్యపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మీడియా సంస్థలకు ఇచ్చిన ఆహ్వానంలో మహిళా జర్నలిస్టులు ఈ వేడుకలను కవర్ చేయకుండా తాలిబన్ ప్రభుత్వం అడ్డుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







