2024లో పర్యాటకుల రాకలో బలమైన వృద్ధి.. ఖతార్

- March 21, 2024 , by Maagulf
2024లో పర్యాటకుల రాకలో బలమైన వృద్ధి.. ఖతార్

దోహా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి ఖతార్ ను సందర్శించే వారి సంఖ్య 53 శాతం దాటిందని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) అధికారిక డేటా వెల్లడించింది.  GCC దేశాల నుండి సందర్శకులు జనవరి 2024లో పర్యాటకుల రాకలో బలమైన వృద్ధి నమోదైంది. స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం సహకారం 7 శాతం నుండి 12 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన జాతీయ వ్యూహం 2030 నాటికి ఆరు మిలియన్ల మంది పర్యాటకులను స్వీకరించే లక్ష్యాన్ని సాధించే దిశగా ఖతార్ కృషి చేస్తోంది.

జనవరి 2024లో GCC నుండి 370,051 మంది సందర్శకులను స్వాగతించింది. 2023లో అదే నెలలో 141,998 మంది సందర్శకులు రాగా..  160.6 శాతం వృద్ధి నమోదు అయింది. డిసెంబర్ 2023లో GCC నుండి వచ్చిన సందర్శకుల సంఖ్య 116.4 శాతం పెరిగి 171,035గా ఉంది. మొత్తం వచ్చినవారిలో గల్ఫ్ ప్రాంతం వారు 53 శాతం మంది ఉన్నారు. ఇతర అరబ్ దేశాలు 7 శాతం మంది ఉండగా, ఈ సంవత్సరం జనవరిలో ఈ ప్రాంతం నుండి 51,583 మంది సందర్శకులు ఖతార్‌ ను సందర్శించారు. గత ఏడాది జనవరిలో 9,446 మంది సందర్శకులు వచ్చారని, వార్షిక ప్రాతిపదికన 446.1 శాతం పెరుగుదల నమోదైంది. 2024 జనవరిలో 289,633 మంది సందర్శకులు ఖతార్‌కు విమానాల ద్వారా వచ్చారు. గత ఏడాది జనవరిలో 150,100 మంది సందర్శకులు వచ్చారు. ఇది సంవత్సరానికి 93 శాతం వృద్ధిని నమోదు చేసింది. సముద్రం ద్వారా వచ్చిన సందర్శకుల సంఖ్య 85,666 కాగా, 327,509 మంది భూ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించారు. మొత్తం సందర్శకులలో 15 శాతం మంది ఆసియా దేశాలకు చెందినవారు. జనవరి 2024లో ఆసియా (ఓషియానియాతో సహా) నుండి 103,713 మంది సందర్శకులు వచ్చినట్లు డేటా వెల్లడించింది. 2023లో అదే నెలలో 57,950 మంది సందర్శకులు వచ్చారు. 79 శాతం వృద్ధి నమోదైంది. జనవరి 2024లో ఇతర ఆఫ్రికన్ దేశాల నుండి సందర్శకులు 8,962 మంది ఉన్నారు. యూరోపియన్ సందర్శకులు మొత్తంలో 20 శాతంగా ఉన్నారు. అమెరికా నుండి వచ్చిన సందర్శకులు ఈ ఏడాది జనవరిలో 31,297 మంది ఉన్నారు.  2023లో ఇదే కాలంలో 24,540 మంది ఉన్నారు. 27.5 శాతం అధికం.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించిన AFC ఆసియా కప్ ఖతార్ 2023కి ఆతిథ్యమివ్వడంతో ఒక్క జనవరిలోనే ఖతార్ 702,800 మంది సందర్శకులు వచ్చారు. 2022 FIFA ప్రపంచ కప్ సందర్భంగా మొదట ఫ్యాన్ వీసాగా ప్రవేశపెట్టిన హయ్యా కార్డ్ పొడిగింపు, ఆసియా కప్ కోసం ఖతార్‌ను సందర్శించే పర్యాటకులకు ప్రయోజనం చేకూర్చిందని నివేదిక తెలిపింది.  మరోవైపు ఖతార్ టూరిజం 2024 కోసం క్యాలెండర్‌ను ప్రకటించింది. 80 కంటే ఎక్కువ ప్రత్యేకమైన ఈవెంట్‌లను నిర్వహించనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com