గ్రాండ్ మసీదు ప్రాంగణంలో యాత్రికుడిని రక్షించిన అథారిటీ
- March 21, 2024
మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంగణంలో స్పృహతప్పి పడిపోయిన బంగ్లాదేశ్ ఉమ్రా యాత్రికుడు పల్స్‌ని పునరుద్ధరించడంలో మక్కాలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్ బృందాలు విజయం సాధించాయి. అంబులెన్స్ బృందాలు ఆదివారం నాడు 50 ఏళ్ల యాత్రికుడు అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడని సమాచారం అందడంతోనే రంగంలోకి దిగాయి. పల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు షాక్ పరికరాన్ని ఉపయోగించి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ను అందించారు. కోలుకున్న యాత్రికుడు అవసరమైన చికిత్సను అందించేందుకు వీలుగా హరమ్ అత్యవసర కేంద్రానికి తరలించినట్లు అథారిటీ తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ కేసులను 997 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







