మరో సరికొత్త రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్..
- March 21, 2024
హైదరాబాద్: అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారి మరింతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. సౌత్ లో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప సినిమాతో నార్త్ లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇక సోషల్ మీడియాలో అయితే అల్లు అర్జున్ హవా మాములుగా ఉండదు. ఇప్పటికే తన సినిమాలతో పలు రికార్డులు సెట్ చేసిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు.
గతంలోనే అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ సాధించి సౌత్ హీరోల్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డ్ సెట్ చేసాడు. ఇప్పుడు తన రికార్డుని తానే బద్దలుకొట్టి మరో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తాజాగా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్నాడు. అంటే రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. దీంతో సౌత్ లోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.
అల్లు అర్జున్ దీనిపై స్పందిస్తూ తన ఫోటోని షేర్ చేస్తూ థ్యాంక్యూ.. 25 మిలియన్స్ అంటూ ఓ పోస్ట్ చేసాడు. దీంతో అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ కి క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వెల్ డన్ లెజెండ్ అని కామెంట్ చేయడం గమనార్హం. ఇక బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ హీరోకి కంగ్రాట్స్ చెప్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు