విమానాశ్రయంలో మొట్టమొదటి రన్‌వే ఇఫ్తార్
- March 21, 2024
దుబాయ్: విమానాలు టేకాఫ్ మరియు డౌన్ అవుతుండగా.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB)లోని ఉద్యోగుల బృందం రన్‌వేపై మొట్టమొదటిసారిగా ఇఫ్తార్‌ను నిర్వహించింది. ఈ మేరకు బుధవారం DXB ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో వివిధ దేశాల సిబ్బంది టార్మాక్‌పై ఇఫ్తార్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఖర్జూరాలు, పండ్లు, స్వీట్లు, రిఫ్రెష్ పానీయాలు మరియు సాంప్రదాయ అరబిక్ వంటకాలతో సహా సంప్రదాయ రంజాన్ ట్రీట్‌లను అక్కడ ఏర్పాటు చేశారు. మా బృంద సభ్యుల మధ్య బలమైన స్నేహ భావాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించామని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మజేద్ అల్ జోకర్ పేర్కొన్నారు.
DXB ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గత సంవత్సరం 86.9 మిలియన్ల మంది ప్రయాణికులను స్వాగతించింది. ఇది 102 అంతర్జాతీయ క్యారియర్‌ల ద్వారా 104 దేశాలలో 262 గమ్యస్థానాలకు నెట్ వర్క కలిగి ఉంది. DXB ఈ సంవత్సరం 88.8 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందింస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు