చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్..
- March 21, 2024
హైదరాబాద్: సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. టాలీవుడ్ లోని రెండు బడా సంస్థలుగా గుర్తింపు సంపాదించుకున్న ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఫెస్టివల్ ని మొదటిసారిగా కండక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా పాల్గొనబోతున్నారు. ఈ ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని లెెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ఉత్సవం మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో గ్రాండ్ గా జరగబోతుంది. సౌత్ సినీ సెలబ్రిటీస్ పాల్గొనే ఈ ఈవెంట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో నటీనటులతో అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. రీసెంట్ యంగ్ సెన్సేషన్, చిరంజీవికి వీరాభిమాని అయిన తేజ సజ్జా.. మెగాస్టార్ కి ట్రిబ్యూట్ గా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోని నేడు హీరోయిన్ త్రిష అభిమానులతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు