బహ్రెయిన్‌లో ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్..సింగపూర్ తో ఒప్పందం
- March 21, 2024
బహ్రెయిన్: బహ్రెయిన్ మరియు సింగపూర్ ప్రభుత్వాలు బహ్రెయిన్‌లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ (BICC)ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ మంత్రి నవాఫ్ బిన్ మొహమ్మద్ అల్ మావ్డా, సింగపూర్ న్యాయ శాఖ మంత్రి కాశీవిశ్వనాథన్ షణ్ముగం వర్చువల్ సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో వివాదాల పరిష్కారం కోసం పరివర్తనాత్మక వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వాణిజ్య న్యాయానికి సంబంధించి అంతర్జాతీయ వ్యవస్థను ఆమోదించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచడం ఈ ఒప్పందం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇది రెండు అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానాల మధ్య సహకారంతోపాటు అంతర్జాతీయ వాణిజ్య వివాద పరిష్కారానికి మెరుగైన ప్రమాణాలను అభివృద్ధి చేయనుందని తెలిపారు. మే 2023లో చీఫ్ జస్టిస్ మీనన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బహ్రెయిన్‌ను సందర్శించినప్పుడు, బహ్రెయిన్ మరియు సింగపూర్ న్యాయవ్యవస్థలు మనీ జడ్జిమెంట్‌ల అమలుకు సంబంధించి సహకారం, మెమోరాండం ఆఫ్ గైడెన్స్ పై అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు