‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్లో స్పష్టత ఆ రోజే రానుందా.?
- March 21, 2024గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అంటే తెలియని వాళ్లు లేరనడం అతిశయోక్తి అనిపించదేమో అన్నంతగా ఆయన పేరు మార్మోగాపోతోంది.
అలాంటి రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. అయితే, షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో, రిలీజ్ డేట్పై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో వుంటుందని అంటున్నారు. అయితే, త్వరలో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ స్పష్టత ఇవ్వనున్నారట. అలాగే, ఈ సినిమాతో పాటూ, రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబో మూవీ కూడా లేటెస్ట్గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా వుండబోతోంది. అలాగే, బుచ్చిబాబు సన సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..