‘ఓమ్ భీమ్ బుష్’ అదిరిపోయే బిజినెస్.!
- March 21, 2024
శ్రీ విష్ణు సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంటుంది. ఎందుకంటే.. అతని సినిమాల్లో కంటెంట్ అలా వుంటుంది మరి. గతేడాది వచ్చిన ‘సామజవరగమన’ మంచి విజయం అందించింది శ్రీ విష్ణుకి. ఈ ఏడాది ‘ఓం భీమ్ భుష్’ అనే సినిమాతో రాబోతున్నాడు.
ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచీ ప్రచార చిత్రాల వరకూ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రేపే అనగా మార్చి 22న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతవరకూ శ్రీ విష్ణు కెరీర్లో ఈ రేంజ్లో ఏ సినిమా విడుదల కాలేదు. భారీ ఎత్తున అత్యధిక సంఖ్యలో ధియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారట.
ఆ స్థాయిలో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనీ తెలుస్తోంది. లేటెస్ట్గా జరిగిన సెన్సార్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం సినిమా సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్.. అనే టాక్ బయటికి వచ్చేసింది. అంతేకాదు, సోలోగానే రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి పోటీ లేకపోవడం.. ఈ టాక్‌కి మరింత బలం చేకూరినట్లే.
ఓ వైపు సమ్మర్.. మరోవైపు కూల్ కామెడీ.. ఇంకేముంది.! ఇలాంటి సినిమాలు ఈ సీజన్లో హిట్స్ అవ్వకుండా ఎందుకుంటాయ్ చెప్పండి. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా వస్తోన్న ‘ఓం భూమ్ భుష్’ సినిమా ఎలా వుండబోతోందో మరి కొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష