ప్రబాస్ సినిమాలో శ్రీలీల.?
- March 21, 2024శ్రీలీలకు ఓ పక్క ఎంత డిమాండ్ వుందో.. మరో పక్క అంతే నెగిటివిటీ వుంది. అయినా కానీ, యూత్‌లో అమ్మడికి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ క్రేజ్‌తోనే వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటోందీ తెలుగమ్మాయ్.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మొదలుకొని పలు క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది శ్రీలీల. ఈ నేపథ్యంలోనే మరో బంపర్ ఆఫర్ శ్రీలీల తలుపు తట్టినట్టు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ ఏంటయ్యా అంటే.! ప్రబాస్‌తో మారుతి తెరకెక్కిస్తున్న సినిమా. ‘రాజా సాబ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటుందట. ఆల్రెడీ మాళవికా మోహనన్ ఓ హీరోయిన్గా ఎంపికైంది.
మరో హీరోయిన్ ప్లేస్‌లో పలు పేర్లు వినిపిస్తున్నాయ్. తాజాగా శ్రీలీలను ఓ హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు మారుతి.
అయితే, శ్రీలీల ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులకి సంబంధించి డేట్లు అడ్జస్ట్ అవుతాయా.? లేదా.? అనే డైలమాలో వుందట. కానీ, ప్రబాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా సినిమా. సో, వదులుకునే ప్రశక్తే వుండదు. మెయిన్ లీడ్ హీరోయిన్ కాదు కాబట్టి.. ఎలాగైనా సరే, డేట్స్ అడ్జస్ట్ చేసేలానే ప్రయత్నిస్తోందనీ ఇన్సైడ్ సోర్సెస్ సమాచారం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ