దోహా ఫెస్టివల్ సిటీ రివర్స్ వెండింగ్ మెషీన్ ప్రారంభం
- March 22, 2024
దోహా: మార్చి 18న గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దోహా ఫెస్టివల్ సిటీ మాల్ అత్యాధునిక రివర్స్ వెండింగ్ మెషీన్ (RVM)ని ప్రారంభించింది. సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ పట్ల దాని నిబద్ధతను తెలియజేయడానికి మాల్ లేటెస్ట్ ఇనిషియేటివ్ ను గ్రౌండ్ ఫ్లోర్‌లోని వెల్కమ్ కోర్ట్ A వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రీసైక్లింగ్ ప్రయత్నాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందగుడుగా భావిస్తున్నారు. RVM అనేది ఈ దశలో ప్లాస్టిక్‌ని మరియు తరువాత దశలో అల్యూమినియం, గ్లాస్‌ని అంగీకరించేలా రూపొందించారు. ఇందులో గ్లాస్ కోసం క్రషర్ మాడ్యూల్, ప్లాస్టిక్ మరియు అల్యూమినియం కోసం ష్రెడర్ మాడ్యూల్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ఇది ఎకో రీసైక్లింగ్ హై-ఎండ్ AI రికగ్నిషన్ టెక్‌ను కలిగి ఉందని దోహా ఫెస్టివల్ సిటీలో అసెట్ మేనేజ్మెంట్ డైరెక్టర్, రాబర్ట్ హాల్ తెలిపారు. RVM పరిచయం గ్రీన్ భవిష్యత్తు వైపు మన ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. సానుకూల పర్యావరణ ప్రభావాన్ని చూపడంలో తమతో చేరాలని ఆహ్వానించారు. తమ బ్రాండ్ ఎథోస్ 'ఇట్స్ మై ప్లేస్, మై ఛాయిస్'కు అనుగుణంగా.. ఈ ప్రయత్నం అని తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు