ఇ-స్కూటర్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి AI రోబోట్

- March 22, 2024 , by Maagulf
ఇ-స్కూటర్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి AI రోబోట్

దుబాయ్: జుమేరా బీచ్ లో సైకిళ్లు మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారులు చేసే ఉల్లంఘనలను గుర్తించేందుకు AI (కృత్రిమ మేధస్సు)తో నడిచే ఐదు అడుగుల, 200 కిలోల రోబోట్‌ను రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) గురువారం మోహరించింది. దీనిలో కెమెరా మరియు నాలుగు మోషన్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. అయితే, ఉల్లంఘనలకు పాల్పడిన రైడర్లకు ఇప్పుడైతే ఎలాంటి జరిమానాలు జారీ చేయటం లేదని RTA స్పష్టం చేసింది.  ఒక నెల రోజుల పాటు ట్రయల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.  రైడర్ హెల్మెట్ ధరించకపోవడం సహా ఉల్లంఘనలను గుర్తించే పనిలో ఉన్న స్వయంప్రతిపత్త రోబోట్ పనితీరును పరిశీలించనున్నారు.  చైనీస్ రోబోటిక్స్ మరియు టెక్నికల్ సిస్టమ్స్ ప్రొవైడర్ టెర్మినస్ రూపొందించిన రోబోట్ స్వయంప్రతిపత్తితో నడుస్తుంది.  అయితే అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఒక భద్రతా అధికారిని ఏర్పాటు చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది. "రాబోయే 30 రోజుల పాటు రోబోట్ జుమేరా బీచ్ 3 యొక్క వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్‌లో 600 మీటర్ల విస్తీర్ణంలో మధ్యాహ్నం 3 నుండి 11 గంటల వరకు.. వారాంతాల్లో సాయంత్రం 5 నుండి ఉదయం 1 గంటల వరకు అది విధుల్లో ఉంటుంది." అని RTA ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్ హమద్ అలఫీఫీ చెప్పారు.  ప్రస్తుతం రోబోట్ 85 శాతం కచ్చితత్వంతో 2 కిలోమీటర్ల వరకు నిఘాతో ఉల్లంఘనలను గుర్తించగలదు. ఇది దుబాయ్ పోలీస్, RTA అధికారులకు 5 సెకన్లలోపు డేటాను అందించగలదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com