దోహా ఫెస్టివల్ సిటీ రివర్స్ వెండింగ్ మెషీన్‌ ప్రారంభం

- March 22, 2024 , by Maagulf
దోహా ఫెస్టివల్ సిటీ రివర్స్ వెండింగ్ మెషీన్‌ ప్రారంభం

దోహా: మార్చి 18న గ్లోబల్ రీసైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దోహా ఫెస్టివల్ సిటీ మాల్ అత్యాధునిక రివర్స్ వెండింగ్ మెషీన్ (RVM)ని ప్రారంభించింది. సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ పట్ల దాని నిబద్ధతను తెలియజేయడానికి మాల్ లేటెస్ట్ ఇనిషియేటివ్ ను గ్రౌండ్ ఫ్లోర్‌లోని వెల్‌కమ్ కోర్ట్ A వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రీసైక్లింగ్ ప్రయత్నాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందగుడుగా భావిస్తున్నారు. RVM అనేది ఈ దశలో ప్లాస్టిక్‌ని మరియు తరువాత దశలో అల్యూమినియం,  గ్లాస్‌ని అంగీకరించేలా రూపొందించారు. ఇందులో గ్లాస్ కోసం క్రషర్ మాడ్యూల్, ప్లాస్టిక్ మరియు అల్యూమినియం కోసం ష్రెడర్ మాడ్యూల్ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ఇది ఎకో రీసైక్లింగ్ హై-ఎండ్ AI రికగ్నిషన్ టెక్‌ను కలిగి ఉందని దోహా ఫెస్టివల్ సిటీలో అసెట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, రాబర్ట్ హాల్ తెలిపారు. RVM పరిచయం గ్రీన్ భవిష్యత్తు వైపు మన ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. సానుకూల పర్యావరణ ప్రభావాన్ని చూపడంలో తమతో చేరాలని ఆహ్వానించారు. తమ బ్రాండ్ ఎథోస్ 'ఇట్స్ మై ప్లేస్, మై ఛాయిస్'కు అనుగుణంగా.. ఈ ప్రయత్నం అని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com