'గిర్గాన్' సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- March 22, 2024
కువైట్: రమదాన్ ఈవెంట్లలో ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజల భద్రత యొక్క ప్రాముఖ్యతను అంతర్గత మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నివాస ప్రాంతాలలో ఈవెంట్లను నిర్వహించడం మానుకోవాలని ప్రజలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ సూచించింది. ఈ ప్రాంతాల్లో వాహనాలు, వినోద వాహనాలు, బ్యాండ్లు మరియు ఫుడ్ ట్రక్కులను ఉపయోగించకూడదని సలహా జారీ చేసింది. అలాంటి కార్యకలాపాలు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తాయని, అలాగే పిల్లలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరించింది. పవిత్ర మాసం మధ్యలో “గిర్గాన్” సమీపిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మంత్రిత్వ శాఖ వాహన డ్రైవర్లు శ్రద్ధ వహించాలన, రద్దీ ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా అంతర్గత రోడ్ల పై, మరియు పబ్లిక్ రోడ్లపై జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు