డ్రగ్స్ స్మగ్లర్లు, అక్రమ రవాణాదారుల పై కఠిన చర్యలు.. అంతర్గత మంత్రి
- March 22, 2024
రియాద్: మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ మేజర్ జనరల్ ముహమ్మద్ అల్-కర్నీ,హేల్ ప్రాంతంలోని నార్కోటిక్స్ కంట్రోల్‌కి చెందిన పలువురు సీనియర్ అధికారులతో హెయిల్‌లోని డైరెక్టరేట్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. డ్రగ్ స్మగ్లర్లు మరియు డీలర్లను అనుసరించడానికి, ట్రాక్ చేయడానికి మరియు అరెస్టు చేయడానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. స్మగ్లర్ల నేర కార్యకలాపాల నుండి దేశాన్ని రక్షించడానికి అధికారులు మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రాంతీయ తనిఖీ పర్యటనకు వచ్చిన ఆయనకు హేల్ ప్రాంతానికి చెందిన ఎమిర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సాద్ మరియు డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫహద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రికి వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







